కాఫీ కబుర్లు కార్యక్రమంలో TDP ఇన్చార్జిలతో మంత్రి నారా లోకేష్

April 15, 2026 11:12 AM

అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన “కాఫీ కబుర్లు” కార్యక్రమంలో పార్టీ క్లస్టర్ ఇన్‌చార్జిలకు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, ఎన్టీఆర్, చంద్రబాబు ఆశయ సాధనే తమ మార్గమని ఆయన స్పష్టం చేశారు.

పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని పేర్కొన్న లోకేష్, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు వాటి వెనుక ఉన్న సిద్ధాంతాలను కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ స్థాయి వరకు ఆరు ముఖ్య సిద్ధాంతాలను తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం కల్పించాలని సూచించారు.“MY TDP” యాప్ ద్వారా కార్యకర్తలు తమ కార్యకలాపాలను నమోదు చేయాలని, ప్రతి ఒక్కరి పనితీరును పార్టీ అధినేత పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త ప్రత్యేక సమయం కేటాయించాలని ఆయన పిలుపునిచ్చారు.కూటమి ఐక్యత, నేతల మధ్య సమన్వయం ముఖ్యమని పేర్కొంటూ, కుటుంబంలా కలిసి పనిచేస్తేనే ప్రభుత్వం స్థిరంగా ఉంటుందని లోకేష్ అన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media