Nara Lokesh మంగళగిరి నియోజకవర్గం Mangalagiriలోని తాడేపల్లి పట్టణం నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. శ్రీరంగం ఫౌండేషన్ సహకారంతో సుమారు రూ.65 లక్షల సీఎస్ఆర్ నిధులతో ఈ కమ్యూనిటీ హాల్ నిర్మించబడింది.
కార్యక్రమానికి వచ్చిన మంత్రి లోకేష్‌కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీరంగం ఫౌండేషన్ వ్యవస్థాపకులు పి.చంద్ర కిరణ్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
