AP విశాఖలో NSTI ఏర్పాటు: కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో మంత్రి నారా లోకేష్ MEET

December 15, 2025 3:25 PM

రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధిని బలోపేతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి జయంత్ చౌదరితో సమావేశం అయ్యారు.

విశాఖపట్నంలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (National Skills Training Institute – NSTI) ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ కేంద్రాన్ని కోరారు.విశాఖ జిల్లా పెదగంట్యాడలో NSTI స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 5 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లు లోకేష్ తెలిపారు.ఈ సంస్థ ఏర్పాటు వల్ల అధ్యాపక అభివృద్ధి, గ్రీన్ స్కిల్స్, డిజిటల్ రూపాంతరం వంటి అంశాల్లో రాష్ట్రం ప్రాంతీయ కేంద్రంగా ఎదుగుతుందని లోకేష్ వివరించారు. రాష్ట్రంలో NCVET అర్హతలను పెద్ద ఎత్తున స్వీకరించేందుకు SBTET-AP ద్వారా ప్రత్యేక అనుమతి మంజూరు చేయాలని కూడా లోకేష్ కోరారు. ఈ సమావేశంలో మంత్రి లోకేష్‌తో పాటు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు ఎంపీలు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media