పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో పలు ఆయిల్ మిల్లులపై విజిలెన్స్ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మిల్లులు మరియు గోదాముల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు నూనె నమూనాలను సేకరించారు.
అధికారుల దాడులతో కొంతమంది మిల్ యజమానులు తమ మిల్లులకు తాళాలు వేసి వెళ్లిపోయినట్లు సమాచారం. సేకరించిన నూనె నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.
