పసిఫిక్‌లో వేడి నీటి ప్రవాహాలు పెరుగుతున్నాయన్న శాస్త్రవేత్తల పరిశీలనలు
భారత్‌లో రుతుపవనాలపై ప్రభావం పడే అవకాశంపై నిపుణుల అంచనాలు
గ్లోబల్ క్లైమేట్ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా ఒక భయంకరమైన వాతావరణ ప్రళయం దూసుకొస్తోంది. భూమి అట్మాస్ఫియర్‌ను కంప్లీట్ గా తలకిందులు చేసే పవర్ ఉన్న గాడ్జిల్లా ఎల్ నినో మళ్లీ యాక్టివ్ అవుతున్నట్లు నాసా శాటిలైట్లు మైండ్ బ్లోయింగ్ అలర్ట్స్ ఇచ్చాయి. ఈసారి లొల్లి కేవలం సముద్రం పైన కాదు, పసిఫిక్ మహాసముద్రం అడుగున నెక్స్ట్ లెవెల్ హీట్ వేవ్స్ క్రియేట్ అవుతున్నాయి. సముద్రం లోతుల్లో నుండి కెల్విన్ తరంగాలు టన్నుల కొద్దీ వేడి నీటిని తూర్పు పసిఫిక్ వైపు నెడుతుండటంతో సైంటిస్టుల మైండ్ బ్లాక్ అవుతోంది.
2026 ప్రారంభంలో లా నినా వైబ్స్ ఉన్న వాతావరణం, సడన్ గా రూట్ మార్చి ఇంత స్పీడ్‌గా ఎల్ నినో వైపు టర్న్ అవ్వడం క్లైమేట్ హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ షాక్.ఈ సారి రాబోయే ఎల్ నినో తీవ్రత ఎలా ఉండబోతుందంటే, గతంలో ప్రపంచాన్ని వణికించిన 1997-98, అలాగే 2015-16 నాటి రికార్డు బ్రేకింగ్ ఉష్ణోగ్రతలను కూడా ఇది అస్సాం పంపించేలా ఉంది.
రికార్డు స్థాయి వేడి నమోదయ్యే అవకాశమా?
అంతర్జాతీయ వాతావరణ మోడల్స్ అంచనా ప్రకారం, పసిఫిక్‌లోని నినో-3.4 రీజియన్‌లో సముద్ర ఉపరితల వేడి సాధారణం కంటే ఏకంగా 3.6 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగే ఛాన్స్ ఉందట. ఇది 2015-16 నాటి గరిష్ట రికార్డు 2.75డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే చాలా ఎక్కువ. అంటే గత 150 ఏళ్ల హ్యూమన్ హిస్టరీలోనే ఇలాంటి ఒక అసాధారణమైన వేడిని భూమి ఎప్పుడూ చూసి ఉండదు.
నాసా శాటిలైట్లు గుర్తించిన కీలక మార్పులు
నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన సెంటినెల్-6 మైఖేల్ ఫ్రైలిచ్ శాటిలైట్ పంపిన డేటా ప్రకారం, పసిఫిక్‌లో తూర్పు నుండి పడమరకు వీచే ట్రేడ్ గాలులు కంప్లీట్ గా వీక్ అయిపోయాయి, దాంతో అడుగున దాగున్న లావా లాంటి వేడి నీరంతా పైకి తన్నుకొస్తోంది. ఈ గాడ్జిల్లా ఎఫెక్ట్ వల్ల గ్లోబల్ వైడ్‌గా వాతావరణం పిచ్చెక్కిపోవడం ఖాయం.
ఒకవైపు కొన్ని దేశాల్లో క్లౌడ్ బరస్ట్‌లు, ఊహించని వరదలు బీభత్సం సృష్టిస్తే, మరోవైపు మరికొన్ని దేశాల్లో రికార్డు స్థాయి కరువు, అడవుల కార్చిచ్చులతో నరకం కనిపించబోతోంది. ఆల్రెడీ 2023, 2024 లలో ప్రపంచం ఎండ దెబ్బకు మాడిపోయింది, ఇప్పుడు ఈ సూపర్ ఎల్ నినో కూడా తోడైతే గ్లోబల్ టెంపరేచర్స్ ఏ రేంజ్ లో బ్లాస్ట్ అవుతాయో ఊహించుకుంటేనే భయమేస్తోంది.
భారత్‌పై ఎంత ప్రభావం పడొచ్చు?
ఇండియా విషయానికి వస్తే సీన్ చాలా సీరియస్ గా ఉంది. ఎల్ నినో యాక్టివ్ అయితే చాలు మన నైరుతి రుతుపవనాలు కంప్లీట్ గా డ్యామేజ్ అవుతాయి. వర్షాలు పడకపోతే అగ్రికల్చర్ సెక్టార్ కొలాప్స్ అవుతుంది, వాటర్ స్కార్సిటీ పెరిగిపోతుంది, పైగా పవర్ జనరేషన్ కూడా దెబ్బతింటుంది. అయితే, మనకు ఉన్న ఒకే ఒక్క హోప్ ఏంటంటే… ఇండియన్ ఓషన్ డైపోల్, లోకల్ వెదర్ కండిషన్స్ గనుక పాజిటివ్ గా ఉంటే ఈ గాడ్జిల్లా ఎఫెక్ట్ నుండి ఇండియా కొంచెమైనా ఎస్కేప్ అవ్వచ్చు. పసిఫిక్ సముద్రం లోతుల్లో నిశ్శబ్దంగా రగులుతున్న ఈ వేడి, రాబోయే రోజుల్లో ఎలాంటి గ్లోబల్ డిజాస్టర్‌కు దారితీస్తుందో చూడాలి.



