బంగ్లాదేశ్‌లోని ప్రసిద్ధ రాక్ స్టార్ జేమ్స్ (ఫరూక్ మహ్మద్ సజ్జాద్ ఉద్దీన్) కచేరీని నిర్వహించడానికి ఏర్పాట్లు చేయగా సింగర్, బాలీవుడ్ హిట్ సాంగ్స్ ‘భీగి భీగి’, ‘అల్విదా’ ఫేమ్ జేమ్స్ లైవ్ కచేరీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కచేరీ జరుగుతున్న సమయంలో ఒక భారీ మూక ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చి విధ్వంసం సృష్టించింది.

ఈ ఘటనలో సుమారు 25 మంది సంగీత ప్రియులు, నిర్వాహకులు గాయపడ్డారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా షోను వెంటనే రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. భద్రతా వైఫల్యంపై గాయకుడు జేమ్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
.
