2020 ఢిల్లీ అల్లర్ల వెనుక ఉన్న భారీ కుట్ర కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జెఎన్యూ మాజీ విద్యార్థి ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. వీరిపై ఉన్న తీవ్రమైన ఆరోపణల దృష్ట్యా వీరికి ఇప్పుడే బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది.

అయితే, ఇదే కేసులో నాలుగేళ్లకు పైగా జైలులో ఉన్న ఐదుగురు సహ నిందితులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రెహ్మాన్, మహమ్మద్ సలీమ్ ఖాన్, షాదాబ్ అహ్మద్లకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన నిందితులతో పోలిస్తే వీరి పాత్ర పరిమితమైనదని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ తీర్పుతో సుదీర్ఘ కాలం తర్వాత వీరు జైలు నుంచి విడుదల కానున్నా
