గుజరాత్‌లోని ఖావ్డా ప్రాంతంలో అదానీ గ్రూప్ దేశంలోనే అతి BIG బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) ప్రాజెక్ట్‌ను ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్ట్‌ను మార్చి 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది పూర్తయిన తర్వాత ప్రపంచంలోని అతి పెద్ద సింగిల్-లొకేషన్ బ్యాటరీ నిల్వ కేంద్రాల్లో ఒకటిగా నిలవనుంది.
ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం సౌర, పవన విద్యుత్ నిల్వ చేసి విద్యుత్ సరఫరా స్థిరత్వాన్ని పెంచడం. ప్రారంభ దశలో 20 గిగావాట్-గంటల (GWh) సామర్థ్యంతో ప్రారంభమై, ఐదు సంవత్సరాల్లో 50 GWh వరకు విస్తరించనుంది.
అదానీ గ్రూప్ ఇప్పటికే ఖావ్డాలో భారీ పునరుత్పాదక ఇంధన హబ్‌ను అభివృద్ధి చేస్తోంది. భారతదేశం 2030 నాటికి 500 గిగావాట్ల పచ్చ విద్యుత్ లక్ష్యాన్ని చేరుకోవాలని సంకల్పించగా, ఈ ప్రాజెక్ట్ ఆ దిశగా కీలక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు తెలిపారు.ఇది ఇలా ఉండగా బాటరీ ప్రాజెక్ట్ గుజరాత్ కె అతి పెద్ద సోలార్ ప్రాజెక్ట్ గుజరాతీలకే ఇస్తున్నారు అని సొమ్ము ఒకరిది సొకు కొందరికి అని అంటున్నారు జనం


