AP:పిల్లల ఆరోగ్యానికి రక్ష National Deworming Day

February 17, 2026 12:56 PM

నెల్లూరు జిల్లా రాపూరు MPDO కార్యాలయంలో MPDO భవాని అధ్యక్షతన మండల వైద్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఫిబ్రవరి 17న (నేడు) నిర్వహించే జాతీయ నులిపురుగుల దినోత్సవానికి సంబంధించిన గోడ పత్రికలను అధికారులు ఆవిష్కరించారు.

1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు మరియు కిశోర బాలబాలికలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు అందించడం.

Dosage:

1 – 2 ఏళ్ల పిల్లలకు అర మాత్రను (200mg) నీటిలో కలిపి తాపించాలి.

3 – 19 ఏళ్ల వారికి ఒక పూర్తి మాత్రను (400mg) బాగా నమిలి మింగాలి.

మండలంలోని అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, మరియు జూనియర్ కళాశాలల్లో ఈ మాత్రలను ఉచితంగా పంపిణీ చేస్తారు.మాఫ్-అప్ డే (Mop-up Day) నేడు మాత్రలు వేసుకోలేకపోయిన విద్యార్థుల కోసం ఫిబ్రవరి 24న ప్రత్యేకంగా మందులు అందజేయడం జరుగుతుంది.మండల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో భవాని కోరారు. ఈ సమావేశంలో డాక్టర్లు ప్రమీల రాజకుమారి, భాను, హెల్త్ సూపర్వైజర్ కిషోర్ కుమార్ మరియు ఏఎన్ఎంలు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media