భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో భారీ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. అమెరికాకు చెందిన AST స్పేస్‌మొబైల్ సంస్థతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంలో భాగంగా, బ్లూబర్డ్ బ్లాక్-2 (BlueBird Block-2) ఉపగ్రహాన్ని మోస్తూ LVM3-M6 రాకెట్ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SHAR) నుంచి నింగిలోకి దూసుకెళ్లింది.ఈ ఉపగ్రహం ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌లకు ఎటువంటి సిగ్నల్ టవర్లు లేకుండానే నేరుగా హై-స్పీడ్ సెల్యులార్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి రూపొందించబడింది.

ఇస్రో చరిత్రలోనే ‘లో ఎర్త్ ఆర్బిట్’ (LEO) లోకి ప్రయోగించబడిన అత్యంత బరువైన పేలోడ్‌గా బ్లూబర్డ్ బ్లాక్-2 రికార్డు సృష్టించింది. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) ద్వారా అమెరికన్ సంస్థతో జరిగిన ఈ ఒప్పందం ఇస్రో యొక్క వాణిజ్య సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.
