కేరళ లో రాజకీయ చరిత్ర ను తిరగరాసిన మహిళ గా శ్రీ లేఖ పేరు తెచ్చుకొన్నారు. నిజానికి శ్రీ లేఖ పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చేది ధైర్యం, నిజాయితీ, క్రమశిక్షణ కలిగిన పోలీస్ ఆఫీసర్ గుర్తుకు వస్తారు. కరుడు కట్టిన గూండా లను ఆమె గడగడా వణికించారు. రాజకీయ ఒత్తిళ్లు, ప్రాణహాని ఉన్న సందర్భాల్లోనూ వెనుకడుగు వేయకుండా దూసుకెళ్లారు.

శ్రీ లేఖ ట్రాక్ రికార్డ్ మామూలుగా లేదు. మొదటి మహిళా మలయాళం ఐ పీ ఎస్ ఆఫీసర్ గా సర్వీస్ లో శ్రీలేఖ జాయిన్ అయ్యారు. యంగ్ ఆఫీసర్ గా ఎన్నెన్నో అక్రమాలను వెలికి తీసి, రాజకీయ పెద్దలను గడ గడ లాడించారు. మాఫియా నెట్వర్క్లు, అక్రమ కార్యకలాపాలు, డ్రగ్స్ ముఠాలపై ఆమె చేసిన దాడులు సంచలనం సృష్టించాయి. మహిళా భద్రత అంశంలో తీసుకున్న కఠిన నిర్ణయాలు ఆమెను సామాన్య ప్రజల హృదయాల్లో హీరోగా నిలబెట్టాయి. సీబీఐ లో జాయింట్ డైరక్టర్ గా ఉన్నప్పుుడుు వరుస దాడులతో రైడ్స్ శ్రీ లేఖ గా పేరు తెచ్చుకొన్నారు. ఆమెను వరుస పెట్టి ట్రాన్స్ ఫర్ లు చేసినా ఎక్కడా వెనుకడుగు వేయలేదు. జైల్స్ శాఖలో అద్బుతమైన సంస్కరణలు తీసుకొని వచ్చి జాతీయ అంతర్జాతీయ అవార్డులు గెలుచుకొన్నారు. డీజీపీ గా రిటైర్ అయిన తర్వాత బీజేపీ లో చేరి ప్రజా జీవితంలో అడుగు పెట్టారు.
రాజకీయాల్లోకి వస్తూనే తనదైన శైలిలో దూసుకెళ్లారు. యువతను ఆకర్షిస్తూ ఆమె ప్రసంగాలు చేశారు. దీంతో రాజధాని త్రివేండ్రంలో సంచలనం రేగింది. కమ్యూనిస్టుల గడ్డ అయిన కేరళ లో మొట్ట మొదటి సారిగా త్రివేండ్రం మేయర్ స్థానాన్ని ఆమె దక్కించుకొన్నారు.
