ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తన భారత పర్యటనలో భాగంగా అనంత్ అంబానీ స్థాపించిన వన్యప్రాణి పునరావాస కేంద్రం ‘వంటార’ (Vantara) ను సందర్శించారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మెస్సీకి వంటారలో భారతీయ పద్ధతిలో పూజలు, సాంప్రదాయ ఆచారాలతో ఘన స్వాగతం లభించింది. సెంటర్లోని జంతువులను పరిశీలించిన మెస్సీ, వన్యప్రాణుల రక్షణ మరియు పునరావాసం కోసం వంటార చేస్తున్న కృషిని అడిగి తెలుసుకున్నారు.

ఈ పర్యటనలో మెస్సీ ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన అత్యంత అరుదైన రిచర్డ్ మిల్లే (Richard Mille) RM 003-V2 GMT టూర్‌బిల్లాన్ ‘Asia Edition’ వాచ్‌తో కనిపించారు. దీని విలువ 10 కోట్లలో ఉంటుందని సమాచారం.
