National :అతని పేరు శంతను: tmc వార్నింగ్

November 12, 2025 4:00 PM

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అవమానకర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి శాంతను ఠాకూర్ పై భాజపాను తీవ్రంగా విమర్శించింది తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ).

బీజేపీ మహిళా వ్యతిరేక దృక్పథాన్ని సంస్థాగతంగా ప్రోత్సహిస్తోందని టీఎంసీ ఆరోపించింది. మమతా బెనర్జీపై పునరావృతమవుతున్న వ్యాఖ్యలు బీజేపీ నేతల్లో ఉన్న “లోతైన అస్థిరత”(stereo type)ను, మహిళా నాయకత్వాన్ని అంగీకరించలేని స్వభావాన్ని చూపుతున్నాయని టీఎంసీ నేతలు పేర్కొన్నారు.

ఇలాంటి వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులు పబ్లిక్‌గా క్షమాపణ చెప్పాలి అని టీఎంసీ డిమాండ్ చేసింది. శాంతను ఠాకూర్ వ్యాఖ్యల వివరాలు పూర్తిగా బయటకు రాకపోయినా, ఇవి బీజేపీ నాయకులచే మమతా బెనర్జీపై జరుగుతున్న లింగవివక్షాత్మక(gender bias) వ్యాఖ్యల పరంపరలో భాగమే అని టీఎంసీ పేర్కొంది.ఈ వివాదం టీఎంసీ-బీజేపీ మధ్య రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media