ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో త్రిపుర రాష్ట్రానికి చెందిన విద్యార్థి దారుణ హత్యకు గురైన ఘటన జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC), డెహ్రాడూన్ DM మరియు SSPలకు నోటీసులు జారీ చేస్తూ సమగ్ర నివేదిక కోరింది.

ఈశాన్య రాష్ట్రాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులను రాజకీయ నేతలు ముక్తకంఠంతో ఖండించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చదువుకుంటున్న ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులపై ఇటువంటి “ద్వేషపూరిత నేరాలు” మళ్ళీ జరగకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని త్రిపుర ప్రభుత్వం కూడా ఉత్తరాఖండ్ అధికారులను కోరింది.
