National : PMO ,రాజ్‌భవన్‌ ,పేరు మార్పు

December 2, 2025 6:13 PM

దేశంలో ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) పేరును సేవాతీర్థ్‌ (Seva Theerth) గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయం నూతన భవనానికి ఈ నామకరణం జరిగింది.

కేంద్ర ప్రకటన:

కేంద్ర హోంశాఖ కార్యాలయం నవంబర్ 25న ఒక ప్రకటన జారీచేస్తూ, ప్రధాన మంత్రి కార్యాలయం పేరును ‘సేవాతీర్థ్‌’గా, రాజ్‌భవన్‌ పేరును లోక్‌భవన్‌ (Lok Bhavan) గా మారుస్తున్నట్లు తెలిపింది. ఆ మేరకు ఇవాళ పీఎంఓకు సేవాతీర్థ్‌గా నామకరణం చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

కేంద్రం నిర్ణయం మేరకు ఇప్పటికే పలు రాష్ట్రాలు తమ రాజ్‌భవన్‌ పేరును లోక్‌భవన్‌గా మార్చాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇవాళ రాజ్‌భవన్‌ పేరును లోక్‌భవన్‌గా మారుస్తూ త్వరలో ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media