తమిళనాడు రాజకీయాల్లో తన ముద్ర వేసేందుకు సిద్ధమైన నటుడు, TVK అధినేత విజయ్ నేడు ఈరోడ్ జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. గతంలో జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటన దృష్ట్యా, పోలీసులు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కఠినమైన నిబంధనలతో ఈ సభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కరూర్ ఘటనలో 41 మంది మృతి చెందిన తర్వాత విజయ్ నిర్వహిస్తున్న మొదటి సభ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సభా ప్రాంగణాన్ని ఇప్పటికే ఎస్పీ సుజాత నేతృత్వంలో అధికారులు పరిశీలించారు. నిర్వాహకులు 84 షరతులకు అంగీకరిస్తూ హామీ పత్రం సమర్పించారు. సభ కారణంగా ఈరోడ్-కోయంబత్తూర్ నేషనల్ హైవేపై ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. కార్యకర్తలు క్రమశిక్షణతో వ్యవహరించాలని పార్టీ చీఫ్ కోఆర్డినేటర్ కేఏ సెంగుట్టయ్యన్ సూచించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ తన ‘ప్రజల్లోకి’ (Meet the People) పర్యటనను ఈ సభతో మళ్లీ వేగవంతం చేస్తున్నారు

