బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలుత కఠిన పోటీగా కనిపించిన పోరు తర్వాత ఒక్కసారిగా ఎన్డీయే వైపు మొగ్గుచూపింది. భారత ఎన్నికల సంఘం తాజా లెక్కింపు మేరకు ఎన్డీయే 190కుపైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 122 మేజిక్ ఫిగర్‌ను దాటిన ఎన్డీయే కొనసాగుతున్న ఆధిక్యంతో గెలుపు దిశగా దూసుకుపోతోంది. కొంతసేపు ఆర్జేడీ కంటే వెనుకబడి కనిపించిన బీజేపీ మళ్లీ వేగంగా లీడ్ పెంచుకుని దాదాపు 80 స్థానాల్లో ముందంజలో ఉంది.
లఖీ సర్య్, అలీనగర్, బక్సర్, పాట్నా సాహిబ్ నియోజకవర్గాల్లో బీజేపీ ముందంజలో ఉంది. రాఘోపూర్, ఠాకుర్‌గంజ్, అంనూర్, హాజీపూర్, బోధ్ గయాల్లో ఆర్జేడీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఉదయం నుంచే బయలుదేరిన ట్రెండ్స్ ఎన్డీయే వైపు భారీ మెజారిటీని సూచిస్తున్నా, పూర్తి ఫలితాలు సాయంత్రానికి స్పష్టమవనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే ఎన్డీయే విజయం వైపు సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో, ప్రస్తుత లెక్కింపులోనూ అదే ధోరణి కనిపిస్తోంది.

