ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారి 91వ జన్మదిన వేడుకలు నేడు (ఫిబ్రవరి 20) వెంకటగిరి పట్టణంలో ఘనంగా నిర్వహించనున్నారు. స్థానిక ఎన్.జె.ఆర్ బంగ్లా వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు, వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

ఉదయం ఎన్.జె.ఆర్ బంగ్లాలో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. ఉదయం 9 గంటలకు కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది. అనంతరం త్రిభువని సెంటర్‌లోని నేదురుమల్లి విగ్రహానికి పూలమాలలు వేస్తారు. మధ్యాహ్నం 11 గంటల నుండి విగ్రహం వద్ద భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ వేడుకల్లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు నేదురుమల్లి కుటుంబ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నేదురుమల్లి కార్యాలయం కోరింది.
