నూతన వధూవరులను ఆశీర్వదించిన నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి

April 13, 2026 11:10 AM

రాపూరు మండలంలోని పిట్టబోయిన కుటుంబంలో జరిగిన వివాహ వేడుకలో వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి పాల్గొన్నారు.

మాజీ సర్పంచ్ పిట్టబోయిన వెంకటసుబ్బయ్య యాదవ్ – సుదర్శనమ్మ దంపతుల ద్వితీయ కుమారుడు సాయికృష్ణ, వైష్ణవి వివాహం ఈ నెల 8న తిరుపతిలోని శ్రీనివాస కల్యాణ మండపంలో ఘనంగా జరిగింది.అనంతరం రాపూరులో జరిగిన వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన రాంకుమార్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు దందోలు లక్ష్మీ నారాయణరెడ్డి, బొడ్డు మధుసూదన్ రెడ్డి, నరసింహ రెడ్డి, పోలంరెడ్డి పెంచలరెడ్డి, మట్టెం మునేంద్ర యాదవ్, కలపాటి మధుసూదన్ రెడ్డి, డాక్టర్ ఖాదర్ భాషా తదితరులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media