పొరపాట్లు లేకుండా ‘సమగ్ర కుటుంబ సర్వే’: కలెక్టర్ హిమాన్షు శుక్ల

February 4, 2026 5:26 PM

జిల్లాలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను నిర్దేశించిన గడువులోగా, అత్యంత పారదర్శకంగా పూర్తి చేయాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలోని తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పనుల పురోగతిని సమీక్షించారు.

కుటుంబ సభ్యుల వివరాల మ్యాపింగ్‌లో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని, వాలిడేషన్ సమయంలో ఇబ్బందులు రాకుండా క్షేత్రస్థాయి సిబ్బందికి తగిన సూచనలు ఇవ్వాలని ఎంపీడీవోలను ఆదేశించారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ-క్రాప్ నమోదును సకాలంలో పూర్తి చేసి, రైతులకు భరోసా కల్పించాలన్నారు. ‘వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్’ కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తులను మరియు గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media