Nellore నగరంలోని వేదాయపాలెంలో Savitribai Phule 129వ వర్ధంతి సందర్భంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. National BC Welfare Association ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి రావులపల్లి వెంకట జ్యోతి నాయకత్వం వహించారు.

ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహిళా విద్య కోసం పోరాడిన తొలి మహిళా ఉపాధ్యాయిగా సావిత్రిబాయి పూలే చేసిన సేవలను నాయకులు కొనియాడారు.బీసీల అభ్యున్నతికి ఆమె చేసిన కృషిని ప్రజలకు చేరవేయాలని నిర్ణయించుకున్నామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సమాధి శ్రీనివాస్ యాదవ్ సూచనలతో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

