కొత్త ఛాన్స్ కొట్టేసిన తమన్నా

December 1, 2025 6:59 PM

మరో చారిత్రక సినిమాలో తమన్నా అవకాశం కొట్టేసింది. సినిమా లెజండ్ శాంతారామ్ జీవితం మీద తీస్తున్న సినిమా లో అవకాశం దక్కించుకొన్నారు. ఈ చిత్రంలో శాంతారాం భార్య, అలనాటి ప్రముఖ నటి సంధ్య పాత్రలో తమన్నా కనిపించనున్నట్లు తెలుస్తోంది. వి. శాంతారాం దర్శకత్వంలో వచ్చిన అనేక చిత్రాల్లో సంధ్య హీరోయిన్‌గా నటించారు. హిందీ, మరాఠీ భాషల్లో ఆమెకు మంచి గుర్తింపు ఉన్న నేపథ్యంలో ఈ బయోపిక్‌లో ఆమె పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ కథ విన్న వెంటనే తమన్నా పాత్ర చేయడానికి ఎంతో ఆసక్తి చూపి అంగీకరించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా విభిన్నమైన కథలను ఎంచుకుంటున్న ఆమె కెరీర్‌లో ఈ పాత్ర మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి ‘చిత్రపతి వి. శాంతారాం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. బాలీవుడ్ యువ నటుడు సిద్ధాంత్ చతుర్వేది టైటిల్ రోల్‌లో నటిస్తుండగా, జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన ‘నటసామ్రాట్’ చిత్ర దర్శకుడు అభిజిత్ దేశ్‌పాండే ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహించనున్నారు. బాలీవుడ్ లో ఈ సినిమా ప్రాజెక్టు కలకలం రేపుతోంది.

మొత్తం మీద కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకొంటున్న తమన్నా.. ఇప్పుడు ఈ ఆప్షన్ ఎంచుకొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media