కన్నడ ప్రముఖ నటుడు దర్శన్ ప్రస్తుతం అభిమానిని హత్య చేసినట్లు ఆరోపణలతో జైలులో ఉన్నాడు. రెణుక ప్రియ హత్య కేసులో విచారణ కొనసాగుతున్నప్పటికీ, ఆయనకు ఇప్పటివరకు బెయిల్ లభించలేదు. దీంతో దర్శన్ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.తాజాగా ఈ కేసులో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. దర్శన్ తన న్యాయవాది సునీల్ ద్వారా కోర్టుకు ఒక భావోద్వేగ విజ్ఞప్తి చేశాడు. జైలులో తనకు కనీస సౌకర్యాలు కూడా ఇవ్వడం లేదని, అవమానకర పరిస్థితుల్లో ఇక జీవించలేనని తెలిపారు. “విషం పెట్టండి చస్తాను కానీ వెంటనే తీర్పు ఇవ్వండి” అని ఆయన కోర్టు ముందు కోరినట్లు వెల్లడించారు.
ఇప్పటివరకు దర్శన్ 20 సార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ, ఒక్కదానికీ అనుమతి లభించలేదు. కేసు తీవ్రత కారణంగా కోర్టు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోందని వర్గాలు చెబుతున్నాయి,న్యాయవాది వాదనలో, దర్శన్ మానసిక స్థితి క్షీణించిందని, దీర్ఘకాల జైలు జీవితం ఆయనపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. “విచారణ త్వరగా పూర్తయి శిక్ష విధిస్తే దానిని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు” అని ఆయన తెలిపారు.
గతంలో దర్శన్ వెన్నునొప్పితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు, “సైనేడ్ ఇస్తే తిని చస్తాను” అని చెప్పిన వ్యాఖ్యను కూడా న్యాయవాది కోర్టుకు గుర్తు చేశారు.వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వు చేసి, తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.
