ట్రూడో సారీ చెప్పారు సరే… కానీ మన సబర్మతీ జైల్లో గ్లోబల్ వైఫై నెట్‌వర్క్ ఏంది ?

July 10, 2026 1:35 PM
Lawrence Bishnoi and Nijjar case linked international security debate.

నిజ్జార్ కేసులో భారత్‌కు ఉపశమనం
జైళ్ల నుంచే నడుస్తున్న గ్యాంగ్‌స్టర్ల నెట్‌వర్క్‌పై కొత్త ప్రశ్నలు

జస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ … ఇండియా ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఒక బిగ్గెస్ట్ విలన్‌లా ప్రొజెక్ట్ చేశారు. కెనడా పీఎం జస్టిన్ ట్రూడో తన దేశ పార్లమెంట్‌లో నిలబడి, ఖలిస్తానీ లీడర్ Nijjar మర్డర్ వెనుక ఇండియన్ ఏజెంట్లు ఉన్నారంటూ మైక్ పగలుగొట్టేలా అరిచారు. కట్ చేస్తే… ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అమెరికా, కెనడాలు చేతులెత్తేస్తూ, సారీ బాస్, నిజ్జార్ హత్యలో ఇండియాకు ఎలాంటి లింక్ లేదు అని అఫీషియల్ క్లీన్ చిట్ ఇచ్చేశాయి.

ఓట్ల కోసం ట్రూడో ఆడిన డ్రామా ఇక్కడితో ఫ్లాప్ అయింది. మనపై పడ్డ అపవాదు పోయింది… దటీజ్ హ్యాపీ ఎండ్. బట్ అసలు పిక్చర్ ఇప్పుడే మొదలైంది. ఈ క్లీన్ చిట్ వెనుక వెస్ట్రన్ కంట్రీస్ యుఎస్, కెనడా, యూరోప్ లు సంయుక్తంగా ఆపరేషన్ హార్డ్‌బాల్ నడిపాయి. అందులో తేలిన పచ్చి నిజం ఏంటంటే… ట్రూడో ఆరోపించినట్టు ఇది ఏదో ఇండియన్ గవర్నమెంట్ చేసిన అఫీషియల్ ఆపరేషన్ కాదు, ఇది పక్కా మన లోకల్ దేశీ గ్యాంగ్‌స్టర్స్ నడిపిన ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్.

ఇక్కడే మన సిస్టమ్‌కు గట్టి చెక్ తగిలింది. ఎందుకంటే, అమెరికా, యూరప్‌లలో మర్డర్స్, డ్రగ్స్ దందా నడిపిస్తున్న కింగ్‌పిన్స్ లారెన్స్ బిష్ణోయ్, జగ్గూ భగవాన్‌పురియాలు ఎక్కడో అండర్‌గ్రౌండ్‌లో లేరు… మన గుజరాత్, అస్సాం జైళ్లలోనే ఉన్నారు. జైలు గదుల నుంచే 5జీ స్పీడ్‌తో వీళ్లు గ్లోబల్ గ్యాంగ్స్‌ను ఆపరేట్ చేస్తుంటే… మన ఇంటెలిజెన్స్, పోలీస్ సిస్టమ్ ఏం చేస్తోందనే క్వశ్చన్ మార్క్ ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా రేజ్ అవుతోంది.

అమెరికా దర్యాప్తు సంస్థ FBI మన దేశంలో ఉన్న ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్ గురిందర్ సింగ్ నాగ్రా కూడా ఈ గ్యాంగ్స్‌తో చేతులు కలిపాడని ఆధారాలతో సహా బయటపెట్టడం మన ప్రతిష్టకు మచ్చలాంటిదే. ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో నక్సలైట్ల అణచివేత పేరుతో పుట్టుకొచ్చిన నయీమ్ ఎలాగైతే జైలు నుంచే అరాచకాలు సృష్టించి ఎందరివో ప్రాణాలు తీశాడు. ఈ రోజు పంజాబ్‌లో బిష్ణోయ్ గ్యాంగ్ కూడా అదే మోడల్ వాడుతోంది. గ్లోబలైజేషన్, సోషల్ మీడియా క్రేజ్‌తో పాపులర్ అయిన సిద్ధూ మూసేవాలా లాంటి యంగ్ సెలబ్రిటీలను బెదిరించడం, మాట వినకపోతే గన్ కల్చర్‌తో ఖతం చేయడం ఈ గ్యాంగ్స్‌కు ఒక బిజినెస్ మోడల్ అయిపోయింది.

ఇంకోవైపు, అమెరికాలో ఉన్న ఖలిస్తానీ లీడర్ పన్నూ హత్యకు మన మాజీ అఫీషియల్ వికాస్ యాదవ్, ఎన్నారై నిఖిల్ గుప్తాలు స్కెచ్ వేశారని అమెరికా జైల్లో పెట్టి మరీ విచారిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే ఒక విషయం క్లియర్… దేశభక్తి పేరుతోనో, లేదా పర్సనల్ గెయిన్స్ కోసమో కొంతమంది చేస్తున్న ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చివరకు ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఇండియాను డిఫెన్స్‌లో పడేస్తున్నాయి.

గ్లోబల్ పొలిటికల్ ప్రెజర్ వల్ల నిజ్జార్ కేసులో మనకు క్లీన్ చిట్ అయితే వచ్చింది కానీ… మన జైళ్ల నుంచి నడుస్తున్న ఈ ఇంటర్నేషనల్ క్రైమ్ నెట్‌వర్క్‌కు మన హోమ్ మినిస్ట్రీ ఇప్పుడైనా పర్మనెంట్ ఎండ్ కార్డ్ వేయకపోతే, ఫ్యూచర్‌లో మరిన్ని ఇంటర్నేషనల్ షాక్స్ తప్పవు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media