తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అరుదైన విజయం నమోదైంది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి ముత్యాల శ్రీవేద కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. శ్రీవేదకు 189 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి హర్షస్వాతికి 188 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు చెల్లనిదిగా నిర్ధారించారు.
ఈ విజయంలో శ్రీవేద మామ ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి పాత్ర కీలకం. ఆయన అమెరికాలో ఉంటుండగా, కోడలి విజయం కోసం ఎన్నికలకు నాలుగు రోజుల ముందు స్వగ్రామానికి వచ్చి ఓటు వేశారు.ఈ ఒక్క ఓటు తేడానే ఫలితాన్ని నిర్ణయించింది. అమెరికా నుంచి వచ్చిన మామ ఓటు, కోడలికి విజయాన్ని అందించడం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది.మొత్తం 426 ఓట్లకు గాను 378 ఓట్లు పోలయ్యాయి.
