భీమ్గల్ నుంచి వేల్పూర్ మీదుగా ఆర్మూర్ దిశగా వందలాది ట్రిప్పుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
ఇటీవల గ్రామస్తులు అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకుని, సరైన పత్రాలు లేవని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే చేరుకున్న పోలీసులు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు.
