ఇటీవల గ్రామస్తులు అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకుని, సరైన పత్రాలు లేవని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు.
ఇసుక కొరత కారణంగా ప్రభుత్వ పథకాల కింద ఇళ్ల నిర్మాణం కూడా ప్రభావితం అవుతోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, ఇకపై అక్రమ రవాణాను అడ్డుకుంటామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
