నిజామాబాద్‌లో BJP కలెక్టరేట్ ముట్టడి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం

March 23, 2026 1:53 PM

నిజామాబాద్‌లో బీజేపీ నేతలు కలెక్టరేట్ ముట్టడి చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా బీజేపీ నేతలు కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.పోలీసులు ముందస్తు అరెస్టులు చేసినప్పటికీ, కార్యకర్తలు భారీగా తరలివచ్చి నిరసనను విజయవంతం చేశారు. ప్రభుత్వం బడ్జెట్‌లో భారీగా నిధులు ప్రకటించినప్పటికీ, జిల్లాలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఎయిర్‌పోర్ట్, రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించలేదని ఆరోపించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శిస్తూ, వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media