జిల్లాలో గంజాయి స్మగ్లర్లు బరితెగించారు. తనిఖీలు చేస్తున్న ఎక్సైజ్ సిబ్బందిపైకి కారును దూకించి హతమార్చేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్ గాజుల సౌమ్య తీవ్రంగా గాయపడ్డారు.

నిర్మల్ జిల్లా నుండి కారులో (TS 24 F 4892) గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో సీఐ స్వప్న నేతృత్వంలోని ఎక్సైజ్ బృందం మాధవనగర్ వద్ద రూట్ వాచ్ నిర్వహించింది.స్మగ్లర్లు పోలీసులను చూసి తప్పించుకోవాలనే ఉద్దేశంతో కారును ఆపకుండా వేగంగా ఎక్సైజ్ సిబ్బందిపైకి దూకించారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ సౌమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. కిడ్నీలు దెబ్బతినడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. తప్పించుకునే క్రమంలో కారు స్తంభాన్ని ఢీకొట్టడంతో స్మగ్లర్లు పట్టుబడ్డారు. నిందితులను నిర్మల్ జిల్లాకు చెందిన సయ్యద్ సోహిల్, మహమ్మద్ సోఫియోద్దీన్గా గుర్తించి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
