నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓటర్ లిస్ట్ అక్రమాలపై నిరసన తెలిపేందుకు వెళ్ళిన బీజేపీ శ్రేణులకు, ఎంఐఎం నాయకులకు మధ్య నగర పేరు విషయంలో పెద్ద యుద్ధమే నడిచింది.
ఓటర్ లిస్ట్ మోసాలను ప్రశ్నిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ‘ఇందూరు కార్పొరేషన్’ అని అనగానే, అక్కడ ఉన్న ఎంఐఎం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఇది నిజామాబాద్.. ఇందూరు కాదు” అంటూ గొడవకు దిగారు. దీనికి దినేష్ పటేల్ గట్టిగా బదులిస్తూ “ఇది చరిత్ర ఉన్న నగరం నా ప్రాణం ఉన్నంత వరకు దీన్ని ఇందూరు అనే పిలుస్తాను. ఆ పేరు వింటే మీకు ఎందుకు అంత భయం?” అని మండిపడ్డారు. ఫేక్ ఓట్లు, అక్రమ రాజకీయాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని చూస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని, బెదిరింపుల పాలనకు ముగింపు దగ్గరపడిందని హెచ్చరించారు.
“షబ్బీర్ బేటా కాదు.. బషీర్ బేటా కాదు ఈ ఇందూరు మట్టిలో పుట్టిన బిడ్డనే మేయర్ పీఠంపై కూర్చోబెడతాం. ఇందూరు కార్పొరేషన్‌లో కాషాయ జెండా ఎగరడం ఖాయం” అని ఆయన గర్జించారు.
