నిజామాబాద్‌లో అకాల వర్షాలు వరి, మొక్కజొన్న పంటలకు నష్టం

March 31, 2026 12:54 PM

ఆర్మూర్ నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం వరి, మొక్కజొన్న పంటలను దెబ్బతీసింది.

నందిపేట్, దొంకేశ్వర్, మాక్లూర్, ఆలూరు మండలాల్లో పలు గ్రామాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలు నేలరాలిపోగా, కలాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి నష్టపోయింది. మొక్కజొన్న పంటలు కూడా ఈదురు గాలుల ప్రభావంతో నేలకొరిగి పాడయ్యాయి.పంటలపై ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టాన్ని అంచనా వేసి తక్షణ సహాయం అందించాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media