రాష్ట్ర డీజీపీ Y. B. Khurania సమక్షంలో మొత్తం 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కలహాండి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో డివిజనల్ కమిటీ సభ్యుడు నకుల్ సహా ఈ మావోయిస్టులు సరెండర్ అయ్యారు.

లొంగిపోయిన వారిలో ఐదుగురు ఏరియా కమిటీ సభ్యులు, ఐదుగురు పార్టీ క్యాడర్లు ఉన్నారు. వీరు ఒక AK-47, ఒక INSAS, నాలుగు SLR రైఫిళ్లు, నాలుగు సింగిల్ షాట్ తుపాకులు మరియు భారీ మందుగుండు సామాగ్రిని పోలీసులకు అప్పగించారు.మహారాష్ట్రకు చెందిన నకుల్ ఒడిశా రాష్ట్ర కమిటీలో డీసీఎంగా పనిచేస్తూ ఉండగా, అతనిపై రూ.22 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

