ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 26 నుంచి

March 6, 2026 5:37 PM

Ontimitta Kodandarama Swamy Templeలో శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల మార్చి 26 నుండి ఏప్రిల్ 5 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా జరగనున్నాయి.

బ్రహ్మోత్సవాలకు ముందుగా మార్చి 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. మార్చి 26న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతిరోజూ ఉదయం మరియు రాత్రి వాహనసేవలు నిర్వహించనున్నారు.మార్చి 27న ధ్వజారోహణం, శ్రీరామనవమి ఆస్థానం, పోతన జయంతి సందర్భంగా కవి సమ్మేళనం జరుగుతుంది. ఏప్రిల్ 1న సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 2న రథోత్సవం, ఏప్రిల్ 4న చక్రస్నానం మరియు ధ్వజావరోహణం నిర్వహిస్తారు. చివరగా ఏప్రిల్ 5న సాయంత్రం పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media