కడప జిల్లా ఒంటిమిట్టలో జరిగే శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల భాగంగా ఏప్రిల్ 1న నిర్వహించనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను మార్చి 30 నాటికి పూర్తి చేయాలని టీటీడీ జేఈఓ వి. వీరబ్రహ్మం ఆదేశించారు.

ఆలయ పరిసరాలు, కళ్యాణ వేదిక, క్యూలైన్లు, యాగశాల, సాంస్కృతిక వేదికలను పరిశీలించిన ఆయన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవి దృష్ట్యా జర్మన్ షెడ్లు, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య ఏర్పాట్లు విస్తరించాలని పేర్కొన్నారు.లేజర్ లైటింగ్, ఎల్ఈడి తోరణాలు, ప్రత్యేక పుష్పాలంకరణలతో ఉత్సవాలకు ఆధ్యాత్మిక శోభ పెంచాలని సూచించారు. అన్నప్రసాద నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన జేఈఓ, భక్తులకు మెరుగైన సేవలు అందించేలా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
