ఓయూలో రెండు కొత్త పథకాలు

June 2, 2026 3:27 PM

హైదరాబాద్‌: అధ్యాపకుల పరిశోధనలకు ₹1 లక్ష నుంచి ₹5 లక్షల వరకు ఆర్థిక సాయం అందించే రిసెర్చ్ సీడ్ గ్రాంట్ స్కీమ్ను ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రారంభించింది. సామాజిక ప్రాధాన్యం ఉన్న, అంతరశాఖ పరిశోధనలకు ఈ నిధులు ఉపయోగపడతాయి. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి పెద్ద మొత్తంలో నిధులు పొందేందుకు అవసరమైన ప్రాథమిక పరిశోధనకు ఇది తోడ్పడుతుందని వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగురం తెలిపారు. పీజీ విద్యార్థులు, పీహెచ్‌డీ పరిశోధకుల కోసం ఇంటర్నేషనల్ అకడమిక్ ఎక్స్‌పోజర్ గ్రాంట్ను కూడా తీసుకొచ్చారు. విదేశాల్లో శిక్షణ, వర్క్‌షాప్‌లు, విద్యా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అర్హులకు గరిష్ఠంగా ₹3 లక్షల వరకు సాయం అందుతుంది. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో టాప్-500లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో జరిగే కార్యక్రమాలకు మాత్రమే ఈ సాయం వర్తిస్తుంది. ఈ రెండు పథకాల కోసం ₹5 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశారు. ఈ నిధికి వచ్చే వడ్డీతో పరిశోధకులు, విద్యార్థులకు దీర్ఘకాలంగా మద్దతు కొనసాగించనున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media