అమలాపురంలో పేదలకు P-4 పథకంతో కార్పొరేట్ వైద్యం

March 18, 2026 5:25 PM

P-4 (Public Private People Partnership) పథకం ద్వారా పేదలకు అత్యాధునిక వైద్య సేవలను అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు తెలిపారు.

అమలాపురం మండలం భట్నవిల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. సాయి విశ్వాస్ హాస్పిటల్ నిపుణులైన వైద్యులు గ్రామ ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో పీ-4 విధానం అమలులోకి వచ్చిందని, ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థలు, ప్రజలు భాగస్వాములై ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media