గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికు చెందిన పి.ఏ సతీష్‌ను విధుల నుంచి తొలగించాలని సీఎంఓ ఆదేశించింది. మహిళను వేధించిన ఆరోపణలపై తక్షణమే కేసు నమోదు చేయాలని కూడా సూచించింది.

సతీష్ వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తూ, పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆదేశించింది. ఆరోపణలు చేసిన మహిళను కూడా విచారించి వాస్తవాలను నిర్ధారించాలి అని స్పష్టంచేసింది.
ఆరోపణలు నిజం కాకపోతే, ఆ మహిళపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని సీఎంఓ సూచించింది.
