BRS MLA పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. జనవరి 29న సమ్మక్క సారక్క జాతర సందర్భంగా జరిగిన ఘటనలో కరీంనగర్ పోలీస్ కమిషనర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో కేసు నమోదైంది.

ఈ కేసును సీఐడీకి బదిలీ చేయడంతో, ఏప్రిల్ 4న హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారాలు నోటీసుల్లో పేర్కొన్నారు.ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
