సరిహద్దు రహస్యాల లీక్ పాక్ గూఢచారి నీ Arrest చేసిన police

March 23, 2026 11:20 AM

దేశ భద్రతకు ముప్పు కలిగించే పాక్ గూఢచారి నెట్‌వర్క్‌ను రాజస్థాన్ పోలీసులు ఛేదించారు. సుమిత్ కుమార్ అనే వ్యక్తిని పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు.

దర్యాప్తులో అతను హనీట్రాప్‌కు గురై, సోషల్ మీడియా ద్వారా పాకిస్థాన్ నిఘా సంస్థ ప్రతినిధులతో సంబంధాలు కొనసాగించినట్లు తేలింది. భారత వైమానిక దళానికి చెందిన కీలక స్థావరాల మ్యాప్‌లు, యుద్ధ విమానాల కదలికల సమాచారం లీక్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.నిందితుడి వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని, వాటిలోని డేటాను విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో మరింత మంది ప్రమేయం ఉందా అన్న కోణంలో లోతైన విచారణ కొనసాగుతోంది.దేశ భద్రతకు విఘాతం కలిగించే చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరించారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను మరింత బలోపేతం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media