ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో విషాదం.. మహిళలు, చిన్నారులు మృతుల్లో ఉన్నారు
బ్రేకులు విఫలమై ప్రమాదం జరిగి ఉండొచ్చన్న అనుమానం.. దర్యాప్తు ప్రారంభం
పాకిస్థాన్: Pakistan లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేశంలోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా రాష్ట్రంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడటంతో కనీసం 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
బలోచిస్తాన్‌లోని షెరానీ జిల్లా దాటిన తర్వాత పెషావర్‌కు వెళ్తున్న బస్సు ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోకి ప్రవేశించిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో గాయపడిన ఎనిమిది మందిని రక్షించి సమీప ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
కొండ ప్రాంతంలోని ప్రమాదకర మలుపు వద్ద బస్సు బ్రేకులు విఫలమవడంతో అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
అయితే ప్రమాదానికి అసలు కారణం ఏంటనే విషయంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
Pakistan ,ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలోని కొండ ప్రాంతాల్లో ప్రమాదకర రహదారులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తరచూ జరిగే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా ఉంటున్నాయని అధికారులు తెలిపారు.



