Palnadu districtలోని Gurazala మండలం తేలుకుట్ల గ్రామంలో పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందస్తు జాగ్రత్తగా ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని సుమారు 40 ద్విచక్ర వాహనాలను పోలీసులు గుర్తించారు.అదేవిధంగా గడ్డపొలుగులు, ఇనుప పైపులు, గొడ్డళ్లు, కొడవళ్లు వంటి అనుమానాస్పద వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ ఆపరేషన్‌లో డీఎస్పీ ఆధ్వర్యంలో 3 మంది సీఐలు, 8 మంది ఎస్ఐలు, సుమారు 50 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు.
