మాచర్ల మండలం హస్నాబాద్ తండాలో పోలీసులు, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 23 ద్విచక్రవాహనాలను స్వాధీన పరచుకున్నట్లు మాచర్ల రూరల్ సీఐ నఫీజ్ బాషా తెలిపారు.
అదే విధంగా 16 గొడ్డళ్లు, 14 కత్తులు పాటు 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఇద్దరు పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ వివరించారు.
అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. కార్డెన్ సెర్చ్‌లో మొత్తం 70 మంది పోలీసులు పాల్గొన్నారు.

