పల్నాడు DEO కార్యాలయం వద్ద ఆక్స్‌ఫర్డ్ స్కూల్ బాధితుల ఉద్రిక్తత

February 27, 2026 11:39 AM

పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారి (DEO) కార్యాలయం వద్ద నిరసన సెగలు చెలరేగాయి. ప్రకాష్ నగర్‌లోని ఆక్స్‌ఫర్డ్ స్కూల్ బాధితులు, విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి డీఈవో కార్యాలయం ఎదుట బైఠాయించారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంలో డీఈవో తప్పుడు నివేదిక ఇచ్చారని వారు తీవ్ర ఆరోపణలు చేశారు.

పాఠశాలలో జరిగిన అన్యాయంపై విచారణ జరిపిన డీఈవో, యాజమాన్యానికి కొమ్ముకాస్తూ వాస్తవాలను దాచిపెట్టి తప్పుడు నివేదిక ఇచ్చారని తల్లిదండ్రులు మండిపడ్డారు.విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్టూడెంట్ యూనియన్లు డిమాండ్ చేశాయి. డీఈవో కార్యాలయం మెట్లపైనే కూర్చొని బాధితులు నిరసన తెలపడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. న్యాయం జరిగే వరకు కదిలేది లేదని వారు స్పష్టం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media