జులై 20 నుంచి ప్రారంభం కానున్న సమావేశాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై ప్రభుత్వం ఫోకస్
జులై 20 నుంచి మొదలయ్యే Parliament సెషన్ గురించి ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తోంది. ఇది మామూలు సెషన్ కాదు, మోదీ 3.0 గేమ్ ప్లాన్ నెక్స్ట్ లెవల్‌లో ఉంది. అసలు పాలిటిక్స్‌లో ఇప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్ అప్‌డేట్స్ నడుస్తున్నాయి. పాత ఈక్వేషన్స్ అన్నీ పక్కన పెట్టి, ఇప్పుడు మొత్తం కొత్త మ్యాప్ గీసే పనిలో కేంద్ర సర్కారు ఉంది.
ఫస్ట్ పొలిటికల్ వైబ్స్ గురించి మాట్లాడితే.. టీఎంసీ లో 28 మంది ఎంపీలలో 20 మంది ఇప్పుడు ఎన్డీఏ వైపు జంప్ అయ్యారు. అలాగే శివసేన లో ఆరుగురు ఎంపీలు సైలెంట్‌గా ఎన్డీఏతో టచ్‌లో ఉన్నారు. రాజ్యసభలో కూడా ఆప్ నుంచి ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరడంతో లెక్కలు పూర్తిగా మారాయి. అంటే, ప్రతిపక్షాల ఇండియా కూటమి కంచుకోటల్లో ఇప్పుడు బీటలు వారాయన్నమాట. ప్రభుత్వం ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్‌తో మేజర్ డెసిషన్స్ తీసుకునే మూడ్‌లో ఉంది.
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై ఫోకస్:
గవర్నమెంట్ టార్గెట్ ఇప్పుడు రెండు పెద్ద బిల్లులు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ (లోక్‌సభ సీట్ల పెంపు). వీటి కోసం ప్రభుత్వం పక్కా ప్లాన్ వేసింది. లోక్‌సభలో 543 సీట్లను 850కి పెంచేయాలి. ఇది పాస్ అవ్వాలంటే టూ-థర్డ్ మెజారిటీ (360 ఎంపీలు) కావాలి. ఎన్డీఏ దగ్గర ఇప్పుడు దాదాపు 319 మంది ఉన్నారు, అంటే ఇంకా 41 మంది ఓట్లు కావాలి. దీనికోసం ప్రభుత్వం లోలోపల చాలా పొలిటికల్ డిల్స్ నడుపుతోంది.
సుప్రియా సూలే షరతు.. కొత్త చర్చ:
సుప్రియా సూలే (NCP-SP) ఒక కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ప్రతి రాష్ట్రంలో సీట్లు 50% పెంచేలా ఫార్ములా ఉంటేనే తాము సపోర్ట్ చేసే విషయం ఆలోచిస్తామని చెప్పారు. ఏ ఫార్ములాతో సీట్లు పెంచుతారు? అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. సౌత్ స్టేట్స్ ఏమో తమకు అన్యాయం జరుగుతుందని భయపడుతున్నాయి. సుప్రియా సూలే కండిషన్ ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేసింది. అటు పి. చిదంబరం లాంటి వాళ్ళు ఇప్పటికే రిజర్వేషన్ ఉంది కదా, మళ్ళీ ఈ బిల్లులు ఎందుకు? అంటూ ప్రభుత్వ ప్లాన్ ని క్వశ్చన్ చేస్తున్నారు.
ఇక రాజ్యసభలో పరిస్థితి చూస్తే, జులై 24 తర్వాత బీజేపీ బలం 117 కి వెళ్తుంది. ఇది ఒక రికార్డ్ నంబర్. కానీ కాన్స్టిట్యూషనల్ అమెండ్‌మెంట్ కోసం 164 మ్యాజిక్ నంబర్ రీచ్ అవ్వాలి. అంటే ఇంకా 11 మంది సపోర్ట్ కంపల్సరీ. దీనికోసం వైఎస్ఆర్సీపీ, డీఎంకే వంటి పార్టీలను ప్రభుత్వం తన వైపు తిప్పుకునే పనిలో ఉంది. ఏ రాజకీయ పార్టీ ఎటువైపు జంప్ అవుతుందో, ఎవరికి ఎవరితో దోస్తీ కుదురుతుందో తెలియని సస్పెన్స్ నడుస్తోంది.
మొత్తానికి, ఈ వర్షాకాల సమావేశాలు ఒక పెద్ద పొలిటికల్ డ్రామా లా ఉండబోతున్నాయి. ప్రభుత్వం తన బిల్లులను పాస్ చేయించుకోవడానికి ఎంత కష్టపడుతుందో, ప్రతిపక్షాలు తమ పట్టు నిలుపుకోవడానికి ఎంత గట్టిగా ఫైట్ చేస్తాయో చూడాలి. ప్రతి సీటు, ప్రతి ఓటు ఇప్పుడు గోల్డ్ లాంటిది. 2029 కి ఒక కొత్త పొలిటికల్ ల్యాండ్‌స్కేప్ కోసం మోదీ గవర్నమెంట్ రెడీ అవుతోంది. ఈ డీలిమిటేషన్ బిల్లు గనుక పాస్ అయితే, దేశం పొలిటికల్ మ్యాప్ మారిపోతుంది. ఏ పార్టీ పవర్ లో ఉంటుంది, ఏ కూటమి స్ట్రాంగ్ గా నిలుస్తుంది అనేది తేలాలంటే ఈ సెషన్ లో జరిగే నెంబర్స్ గేమ్ అబ్జర్వ్ చేయాల్సిందే.



