Pawan Kalyan ఆరోగ్యం కోసం అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని Panduranga Swamy Templeలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి Bodapati Shivdath ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాసేవలో పవన్ కళ్యాణ్ చూపిస్తున్న నిబద్ధత, పారదర్శకత రాష్ట్రానికి ఆదర్శమని కొనియాడారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.రాష్ట్ర అభివృద్ధి, యువత ఉపాధి, గ్రామీణాభివృద్ధి వంటి అంశాల్లో ఆయన పాత్ర కీలకమని పేర్కొంటూ, త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రుద్రాభిషేకం, మహా మృత్యుంజయ హోమం నిర్వహించి ఆయన ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
