పవన్ కళ్యాణ్ vs అపోజిషన్ మైండ్ గేమ్స్… ఆర్ యు ట్రాప్డ్ బాస్? … పవన్ కళ్యాణ్ రూట్ మార్చాలా?

July 9, 2026 3:49 PM
Pawan Kalyan addressing media amid political controversy.

AP: జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం Pawan Kalyan కి ఇప్పుడు టైం అస్సలు కలిసివస్తున్నట్లు లేదు. పవర్ ఒకవైపు ఉంటే, ప్రాబ్లమ్స్ ఇంకోవైపు వెంటాడుతున్నాయి. రెండూ కలిపి ఆయన చుట్టూ బిగ్ బాస్ హౌస్ లాంటి డ్రామా క్రియేట్ చేస్తున్నాయి. ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఆయన తెచ్చుకున్నవి అయితే, మరికొన్ని మాత్రం అయాచితంగా వచ్చి పడిన అన్ వాంటెడ్ తలనొప్పులు. విజయవాడ కృష్ణా లంకకు చెందిన గాదె సాయి కృష్ణ కేసు ఇప్పుడు జనసేనకు పెద్ద తలనొప్పిగా మారింది. యాక్చువల్ గా, ఇందులో జనసేన తప్పు ఏమీ లేదు. లక్షల మంది ఉండే పార్టీలో ఎవడు ఎలాంటి వాడో స్క్రీనింగ్ చేయడం ఏ పొలిటికల్ పార్టీకైనా ఇంపాజిబుల్. అతని క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ తెలియగానే జనసేన తనను దూరం పెట్టింది. దట్స్ ఏ గుడ్ మూవ్.

కానీ ట్విస్ట్ ఏంటంటే… అపోజిషన్, సోషల్ మీడియా ట్రోలర్స్ ఈ ఇష్యూని పట్టుకుని జనసేనని విపరీతంగా టార్గెట్ చేశారు. ఇక్కడే పవన్ కళ్యాణ్ కొంచెం ఎమోషనల్ అయిపోయి, క్రిమినల్స్‌కి కులాలు ఏంటి? అంటూ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. పొలిటికల్ అనలిస్టులు మాత్రం అపోజిషన్ వేసిన ట్రాప్‌లో పడ్డారని అంటున్నారు. ఇలాంటి వాటికి సైలెంట్‌గా ఉంటేనే సీన్ లైట్ అయిపోయేదని తేల్చేశారు.

ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది ఒక రేంజ్ టాక్సిక్ ప్లేస్ అయిపోయింది. సెలబ్రిటీలని, పొలిటీషియన్లని టార్గెట్ చేసి విమర్శిస్తే తాము కూడా పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయిపోతామనే భ్రమలో కొందరు ఉన్నారు. రీసెంట్‌గా ఒక యూట్యూబర్ పవన్ మీద విపరీతమైన కామెంట్స్ చేస్తే, పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది.


మ్యాటర్ అక్కడితో క్లోజ్ చేయాల్సింది. కానీ, అతనిపై ఉపా లాంటి కఠినమైన చట్టాలను ప్రయోగించే దాకా వెళ్లడం అంటే… చిన్న ఇష్యూని కొండంత చేసి, విమర్శకులకు మరింత స్పేస్ ఇచ్చినట్లే అని టాక్ నడుస్తోంది. యూట్యూబర్‌ని ఏ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లినా, అక్కడ జనసైనికులు ల్యాండ్ అయిపోయి, గోడలు దూకడం, స్లోగన్స్ ఇవ్వడం, హంగామా చేయడం లాంటివి చేస్తున్నారు. ఒక ఇష్యూ మీద ఆల్రెడీ గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్‌మెంట్ సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటున్నప్పుడు, మధ్యలో ఈ పార్టీ క్యాడర్ రచ్చ చేయడం వల్ల జనసేనకే బ్యాడ్ నేమ్ వస్తోంది.

ప్రస్తుతం ఏపీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రాసెస్ నడుస్తోంది. టీడీపీ, వైసీపీ నేతలు చాలా స్మార్ట్‌గా గ్రౌండ్ లెవెల్‌లో ఉండి తమ ఓటర్ బేస్ తగ్గకుండా చూసుకుంటున్నారు. జనసేన కూడా ఇప్పుడు బలమైన థర్డ్ ఫోర్స్ గా ఎదుగుతోంది. ఇలాంటి టైంలో జనసైనికులు రోడ్ల మీద రేజ్ చూపించడం కంటే లోకల్ ఎలక్షన్స్ మీద ఫోకస్ పెట్టాలి.

తమ సానుభూతిపరుల ఓట్లు మిస్ కాకుండా చూసుకోవాలి. గ్రౌండ్ లెవెల్ పార్టీని మరింత పటిష్టం చేయాలి. పవన్ కళ్యాణ్ అండ్ కో ఇప్పుడు ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. పవర్ లోకి వచ్చాక విమర్శలు రావడం చాలా కామన్. ప్రతి చిన్న కామెంట్‌కి, ట్రోల్‌కి రియాక్ట్ అయి ఎనర్జీ వేస్ట్ చేసుకోకూడదు. ఇగ్నోర్ ద నాయిస్, ఫోకస్ ఆన్ ద గేమ్ అనే మైండ్‌సెట్‌తో వెళ్లకపోతే, అపోజిషన్ సెట్ చేసే మైండ్ గేమ్స్ లో జనసేన చిక్కుకుపోయే ఛాన్స్ గట్టిగానే ఉంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media