ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన పెంచలకొనలో జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలపై నేడు కీలక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
రాపూరు మండలంలోని శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 27 నుంచి మే 3, 2026 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయడానికి అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు.ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, నెల్లూరు రెవిన్యూ డివిజనల్ అధికారి ఆధ్వర్యంలో ఈ సమీక్ష సమావేశం జరుగుతుంది.ఆర్యవైశ్య సత్రంలో నిర్వహించే ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొని ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించనున్నారు అని దేవస్థానం ఈవో కె. జనార్ధన్ రెడ్డి తెలిపారు.
