ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకొనలో వెలసియున్న శ్రీ పెనుశీల లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం నేడు మూసివేస్తున్నట్లు దేవస్థానం అధికారులు ప్రకటించారు. కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
గ్రహణం కారణంగా 03-03-2026 (మంగళవారం) ఉదయం 9 గంటల నుంచే ఆలయ ద్వారాలు మూసివేయబడ్డాయి.తిరిగి 04-03-2026 (బుధవారం) ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం, స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. మంగళవారం స్వామివారికి నిర్వహించే అన్ని ఆర్జిత సేవలు మరియు నిత్యాన్నదాన కార్యక్రమాన్ని దేవస్థానం రద్దు చేసింది. గ్రహణం తర్వాత శాస్త్రోక్తంగా పుణ్యాహవాచనం, సంప్రోక్షణ నిర్వహించిన పిమ్మట యధావిధిగా దర్శనాలు కల్పిస్తామని దేవస్థానం ఈఓ పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.పెంచలకొన క్షేత్రానికి వచ్చే భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని అధికారులు కోరారు.
