రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకొనలో శ్రీపెనుశీల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు జరుగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం అనుజ్ఞ, విశ్వక్సేనారాధన, పుణ్యహవాచనం, రక్షాబంధనం, అంకురార్పణ హోమం వంటి పూజలు ప్రధానార్చకులు, వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య వైభవంగా నిర్వహించారు.వసంతోత్సవాల సందర్భంగా మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకు స్వామివారి నిత్యకల్యాణం రద్దు చేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి తెలిపారు.
