పెంచలకొనలో ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి వసంతోత్సవాలు

April 2, 2026 11:39 AM

నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకొనలో శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి అమ్మవార్ల దేవస్థానంలో వసంతోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం విశేష పూజలు, అగ్నిరాధన నిర్వహించారు. సాయంత్రం శ్రీవారికి నిత్యహోమం, ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం హంసవాహన సేవను ఘనంగా నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు మంగళ వాయిద్యాలు, మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media